జీతాల కోసం 22న గిరిజన సంక్షేమ డైరెక్టరేట్‌ ముట్టడి: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-12-13T03:41:49+05:30 IST

ఉపాధ్యాయులంతా ఈ నెల 22న గిరిజన సంక్షేమ డైరెక్టర్‌ కార్యాలయ ముట్టడికి సిద్ధంగా ఉండాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

జీతాల కోసం 22న గిరిజన సంక్షేమ డైరెక్టరేట్‌ ముట్టడి: యూటీఎఫ్‌

సీతంపేట, డిసెంబరు 12: ఉపాధ్యాయులంతా ఈ నెల 22న గిరిజన సంక్షేమ డైరెక్టర్‌ కార్యాలయ ముట్టడికి సిద్ధంగా ఉండాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఐటీడీఏల పరిధిలోని 1.86 లక్షల మంది ఉపాధ్యాయులకు నవంబరు వేతనం చెల్లింపులో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వీరిలో 86 వేల మంది ఉపాధ్యాయులకు నేటికీ జీతాలు చెల్లించలేదన్నారు.

Updated Date - 2022-12-13T03:41:49+05:30 IST

Read more