రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు చిన్నారులు సహా డాక్టర్ మృతి

ABN , First Publish Date - 2022-09-25T13:15:41+05:30 IST

రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రి బిల్డింగ్ పై అంతస్తులో

రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు చిన్నారులు సహా డాక్టర్ మృతి

Tirupati: రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రి బిల్డింగ్ పై అంతస్తులో ఉంటున్న డాక్టర్ కుటుంబం మంటల్లోనే చిక్కుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు డాక్టర్ రవిశంకర్ రెడ్డి దుర్మరణం చెందారు. డాక్టర్‌ తల్లి, భార్యను రెస్క్యూ టీమ్‌ రక్షించారు. గాయాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులో తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కార్తిక(6), సిద్దార్థరెడ్డి(12), డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Read more