‘బ్రదర్ అనిల్... ఏపీ రాజకీయాల్లో తలదూర్చకండి’

ABN , First Publish Date - 2022-03-16T17:54:37+05:30 IST

ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్‌ రాజకీయ పార్టీ పెడతాననడం హాస్యాస్పదమని ఏపీ క్రిష్టియన్ జేఏసీ వ్యాఖ్యానించారు.

‘బ్రదర్ అనిల్... ఏపీ రాజకీయాల్లో తలదూర్చకండి’

తిరుపతి: ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్‌ రాజకీయ పార్టీ పెడతాననడం హాస్యాస్పదమని ఏపీ క్రిష్టియన్ జేఏసీ వ్యాఖ్యానించారు. ఏపీ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ... దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్ ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తాడో చెప్పాలన్నారు. ‘‘తెలంగాణలో పెట్టుకున్న పార్టీ పనులు చూసుకోండి కానీ ఏపీ రాజకీయాల్లో తలదూర్చకండి’’ అంటూ హితవుపలికారు. అగ్రకులానికి చెందిన బ్రదర్ అనిల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఉద్ధరిస్తాననడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. కేఏ పాల్ పతనం తర్వాత బ్రదర్ అనిల్‌ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాంతి దూతగా ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. బ్రదర్ అనిల్ రాజకీయాల్లో తలదూర్చకూడదని ప్రేమగా హెచ్చరిస్తున్నామని ఏపీ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్ తెలిపారు. 

Read more