Tirumala: రికార్డుస్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2022-08-02T02:26:52+05:30 IST

టీటీటీ (TTD) చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెల్లో రికార్డుస్థాయిలో వేంకటేశ్వరస్వామికి హుండీ ఆదాయం లభించింది. 23.45 లక్షలమంది శ్రీవారిని దర్శించుకోగా

Tirumala: రికార్డుస్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల: టీటీటీ (TTD) చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెల్లో రికార్డుస్థాయిలో వేంకటేశ్వరస్వామికి హుండీ ఆదాయం లభించింది. 23.45 లక్షలమంది శ్రీవారిని దర్శించుకోగా రూ.139.46 కోట్లు హుండీ ద్వారా ఆదాయం లభించింది. అత్యధికంగా 4వ తేదీన రూ.6.18 కోట్లు లభించగా 11న రూ.5.58 కోట్లు, 12న రూ.5.05 కోట్లు, 14న రూ.5.45 కోట్లు, 25న 5.12 కోట్లు చొప్పున ఐదుసార్లు ఐదు కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మరోవైపు ఇదే నెల్లో 24వ తేదీన 88,815, 3న 88,682, 2న 88,026 మంది భక్తులు (devotees) శ్రీవారిని దర్శించుకున్నారు.మార్చినెల్లో 19.72 లక్షల మంది దర్శించుకోగా,రూ.128.61 కోట్లు ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ నెలలో 20.62 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, వీరి ద్వారా రూ.127.63 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది. 


అలాగే మే నెల్లో 22.68 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా వీరి ద్వారా రూ.130.29 కోట్లు లభించింది. అలాగే జూన్‌ నెలలో 23.23 లక్షల మంది భక్తులకు దర్శించుకుని రూ.123.74 కోట్లు కానుకలు సమర్పించారు.జూన్‌ నెలలో హుండీ ఆదాయం కాస్త తగ్గినప్పటికీ, మే నెలలో రికార్డుగా ఉన్న రూ.130.29 కోట్లను, జూలై నెల రూ.139.46 కోట్ల హుండీ ఆదాయం దాటింది. టీటీడీ చరిత్రలోనే ఇదే భారీ రికార్డుగా చెప్పుకోవచ్చు. కరోనా ప్రభావం తగ్గడం, విద్యార్థులకు పరీక్ష ఫలితాలు రావడం, వేసవి సెలవులు కూడా జత కావడంతో గత నాలుగు నెలల కంటే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో పాటు హుండీ ఆదాయం కూడా భారీగా లభించింది. కరోనా సమయంలో రెండేళ్లుగా భక్తులు ఇళ్లలో కట్టుకున్న ముడుపుల ప్రభావం కూడా ప్రస్తుతం వెంకన్న హుండీపై కనిపిస్తోంది.

Updated Date - 2022-08-02T02:26:52+05:30 IST