యూట్యూబ్‌ విలేకరుల బెదిరింపులు

ABN , First Publish Date - 2022-10-05T08:25:14+05:30 IST

యూట్యూబ్‌ విలేకరుల బెదిరింపులు

యూట్యూబ్‌ విలేకరుల బెదిరింపులు

వ్యాపారి ఆత్మహత్యాయత్నం

ఏలూరు కలెక్టరేట్‌, అక్టోబరు 4: ఏలూరు జిల్లా ఏలూరులో ఇద్దరు యూట్యూబ్‌ విలేకరులు డబ్బు కోసం బెదిరించారంటూ ఓ బియ్యం వ్యాపారి పురుగుమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాఽధిత వ్యాపారి మురళి కథనం ప్రకారం..  స్థానిక సాయిబాలాజీ థియేటర్‌ సమీపంలో మురళి బియ్యం వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల యూట్యూబ్‌ విలేకరులమంటూ మత్తేబాబి, మహేష్‌ అతడివద్దకు వచ్చారు. షాపులో అక్రమంగా పీడీఎప్‌ రైస్‌ నిల్వ చేసి అమ్ముతున్నావని, లక్ష రూపాయలు ఇవ్వకపోతే రెవెన్యూ అధికారులతో చెప్పి అరెస్టు చేయిస్తామని బెదిరించారు. తాను పీడీఎఫ్‌ రైస్‌ అమ్మడంలేదని, కావాలంటే తనిఖీలు చేసుకోవచ్చునని చెప్పగా, వెంటనే వెళ్లిపోయి ఫోన్‌లో బెదిరించడం మొదలు పెట్టారు. ఆ వేధింపులు తట్టుకోలేక మురళి మంగళవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు యూట్యూబ్‌ విలేకరులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలిపారు. 


Read more