అన్నను రక్షించి.. అమరులయ్యారు!

ABN , First Publish Date - 2022-07-18T08:56:14+05:30 IST

అన్నను రక్షించి.. అమరులయ్యారు!

అన్నను రక్షించి.. అమరులయ్యారు!

కరెంటు షాక్‌తో ఇద్దరు సోదరుల మృతి.. అనంతలో పెను విషాదం

కణేకల్లు, జూలై 17: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఉడేగోళం గ్రామ సమీపాన పొలంలో ఆదివారం విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందగా..మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామ మాజీ సర్పంచ్‌ యల్లప్ప కుమారులైన రమేష్‌ (33), దేవేంద్ర (26), వన్నూరుస్వామి తమ భూమిలో వ్యవసాయ విద్యుత్‌ మోటారు సాయంతో నీరు వదులుతూ వరి విత్తనాలు చల్లే పనిలో నిమగ్నమయ్యారు. అయితే మోటారు మొరాయించగా దానిని సరిచేసే ప్రయత్నంలో పెద్దవాడైన వన్నూరుస్వామికి షాక్‌ కొట్టింది. గమనించిన సోదరులు.. అన్నను కాపాడేందుకు అతన్ని పట్టుకున్నారు. ముగ్తురూ విద్యుత్‌ షాక్‌తో అపస్మారక స్థితిలో పడిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న వన్నూరుస్వామి గ్రామస్థులకు, బంధువులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని రమేష్‌, దేవేంద్రను కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ ఇద్దరూ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


Read more