కూల్చడంలోనే వాళ్లకు తృప్తి: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-09-08T08:50:09+05:30 IST

కూల్చడంలోనే వాళ్లకు తృప్తి: చంద్రబాబు

కూల్చడంలోనే వాళ్లకు తృప్తి: చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కడపలో అన్న క్యాంటీన్‌ కూల్చివేతపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘మీకు కూల్చడంలో ఉన్న తృప్తి వేరే ఎందులోనూ కన్పించకపోవడం ఏపీ దురదృష్టం. నిర్మించడం ఎంత కష్టమో, కూల్చడంతో ఎంత నష్టమో తెలుసుకునే సమయం కూడా ఇక మీకు లేదు. ప్రభుత్వ ఆలోచనలు ఇలా కూడా ఉంటాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆవేదన చెందుతున్నారు’’ అని ట్వీట్‌ చేశారు.


Read more