దేశంలో పెట్రోల్‌ కొరత లేదు

ABN , First Publish Date - 2022-06-12T08:39:23+05:30 IST

దేశంలో పెట్రోల్‌ కొరత లేదు

దేశంలో పెట్రోల్‌ కొరత లేదు

 కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌ పురి 

విశాఖపట్నం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచమంతా పెట్రోల్‌ కొరత ఏర్పడడంతోపాటు ధరలు కూడా పెరిగాయని, అయితే ప్రధాని మోదీ దూరదృష్టితో వ్యవహరించడం వల్ల దేశంలో పెట్రోల్‌కు కొరత ఏర్పడలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి అన్నారు. శనివారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవాలు చేస్తున్నామన్నారు. ఇటీవల మోదీ పెట్రోల్‌ ధర లీటరుకు రూ.10 తగ్గించారని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరలు తగ్గించాలని పురి సూచించారు. పెట్రోల్‌ను జీఎ్‌సటీ పరిధిలోకి తేవాలంటే రాష్ట్రాల అంగీకారం ఉండాలన్నారు. ప్రధాని ఆవాస్‌ యోజనలో రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరించి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ప్రజలకు స్వచ్ఛతను అలవాటు చేస్తున్నామని, దానికి అలవాటు పడితే దేశం బాగుంటుందని వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-12T08:39:23+05:30 IST