బియ్యం ఎగుమతిపై నిషేధం లేదు!

ABN , First Publish Date - 2022-08-31T09:32:30+05:30 IST

బియ్యం ఎగుమతులను నిషేధించే ప్రణాళిక ఏదీ ప్రభుత్వం వద్ద లేదని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, దేశీయ అవసరాల కోసం తగినంత బియ్యం నిల్వలు(బఫర్‌) ప్రభుత్వం వద్ద ఉన్నాయని పేర్కొన్నాయి. బియ్యం ఎగుమతులపై

బియ్యం ఎగుమతిపై నిషేధం లేదు!

ప్రభుత్వ వర్గాల వెల్లడి.. వ్యాపారులకు ఊరట


న్యూఢిల్లీ, ఆగస్టు 30: బియ్యం ఎగుమతులను నిషేధించే ప్రణాళిక ఏదీ ప్రభుత్వం వద్ద లేదని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, దేశీయ అవసరాల కోసం తగినంత బియ్యం నిల్వలు(బఫర్‌) ప్రభుత్వం వద్ద ఉన్నాయని పేర్కొన్నాయి. బియ్యం ఎగుమతులపై పరిమితి విధించేందుకు కొన్ని చర్చలు జరిగినా, ఇప్పటి వరకూ దానిపై నిర్ణయం తీసుకోలేదని, ఇప్పట్లో పరిమితి విధించే అవకాశం లేదని ఆ వర్గాలు తెలిపాయి. చైనా తర్వాత బియ్యం ఎగుమతిలో రెండో అతిపెద్ద దేశం మనదే. ప్రపంచ బియ్యం వర్తకంలో 40 శాతం వాటాను భారత్‌ కలిగి ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2.12 కోట్ల టన్నుల బియాన్ని భారత్‌ ఎగుమతి చేసింది. 

Read more