పాలీసెట్‌ తుది దశలో 4312 మందికి సీట్లు

ABN , First Publish Date - 2022-09-10T09:42:39+05:30 IST

పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ తుది దశలో 4312 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని సాంకేతికవిద్యా శాఖ కమిషనర్‌ సి.నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు.

పాలీసెట్‌ తుది దశలో 4312 మందికి సీట్లు

అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ తుది దశలో 4312 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని సాంకేతికవిద్యా శాఖ కమిషనర్‌ సి.నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. తుది దశ కౌన్సెలింగ్‌లో 12773 మంది ఆప్షన్లు పెట్టుకోగా ఈ మేరకు సీట్లు కేటాయించినట్లు వివరించారు. దీంతో ఈ ఏడాది మొత్తం డిప్లొమా కోర్సుల్లో 36349 మంది అడ్మిషన్లు తీసుకున్నారని, 37993 సీట్లు మిగిలిపోయాయని పేర్కొన్నారు.


గతేడాది కుట్టుకూలి.. తల్లుల ఖాతాల్లో 61.73 కోట్లు

జగనన్న విద్యాకానుక (2021-22)లో విద్యార్థులకు ఇచ్చిన మూడు జతల యూనిఫాం క్లాత్‌కు కుట్టుకూలి నగదును పాఠశాల విద్యాశాఖ శుక్రవారం తల్లుల ఖాతాల్లో జమచేసింది. 43,06,032 మంది తల్లుల ఖాతాల్లో రూ.61.73 కోట్లు జమ చేసినట్లు ఆ శాఖ కమిషనర్‌  తెలిపారు.  


పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌

విద్యార్థులు బడికి రాకపోతే ఆటోమేటిక్‌గా వారి తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం వెళ్లే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది. కొత్తగా తీసుకొచ్చిన హాజరు యాప్‌ ద్వారా హాజరువేసిన తర్వాత ఆబ్సెంట్‌ అయిన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రులకు చేరుతోంది. 

Read more