సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-08-15T08:11:25+05:30 IST

సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తి

సమరయోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తి

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

విజయవాడ (గవర్నర్‌పేట), ఆగస్టు14: స్వాతంత్య్ర సమరయోధుల ఉద్యమ ఘట్టాలను నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బందరు లాకుల సెంటర్‌లో స్వాతంత్య్ర సమరయోధుల భవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ 30 అడుగుల విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయని, వాటి స్ఫూర్తితో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు దేశ ప్రజలకు స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Read more