రైతుల యాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి: మాగంటి బాబు

ABN , First Publish Date - 2022-10-06T00:24:28+05:30 IST

రైతుల యాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి: మాగంటి బాబు

రైతుల యాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి: మాగంటి బాబు

అమరావతి: సీఎం జగన్, వైసీపీ మంత్రులపై టీడీపీ నేత మాగంటి బాబు విమర్శలు గుప్పించారు. రైతుల యాత్రను ఫేక్ అంటున్న మంత్రులు, సీఎం ఫేక్‌ అని మాగంటి బాబు విమర్శించారు. రైతుల యాత్రకు ఫేక్ ఐడీలు మీరే ఇచ్చారా  చెప్పాలని మాగంటి బాబు ప్రశ్నించారు. రైతులపై అభాండాలు వేయడం తగదని ABNతో మాగంటి బాబు అన్నారు. అమరావతి యాత్రకు ప్రజాదరణ చూసి వైసీపీ భయపడుతోందని, రైతులను అవమానించేలా ప్రభుత్వం మాట్లాడడం సరికాదని తెలిపారు. రైతుల యాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని మాగంటి బాబు డిమాండ్ చేశారు.

Read more