బాలికపై ఇద్దరు అత్యాచారం

ABN , First Publish Date - 2022-08-31T08:51:25+05:30 IST

గుంటూరులోని పట్టాభిపురం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. ఈ నెల 27న 14 ఏళ్ల బాలిక రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

బాలికపై ఇద్దరు అత్యాచారం

గుంటూరు, ఆగస్టు 30: గుంటూరులోని పట్టాభిపురం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. ఈ నెల 27న 14 ఏళ్ల బాలిక రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.  దర్యాప్తు చేయగా బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించారు. ఆమె స్కూలుకు వెళ్లే సమయంలో నాని అనే యువకుడు పరిచయమయ్యాడు. 27న బాలికను తన ద్విచక్ర వాహనంపై  ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఇంటి సమీప ప్రాంతంలో వదిలివెళ్లగా 45 ఏళ్ల జగన్మోహనరెడ్డి అనే వ్యక్తి బాలికను చేరదీసి  అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read more