పీఏసీఎస్‌ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-09-10T08:46:20+05:30 IST

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది.

పీఏసీఎస్‌ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం

అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఉద్యోగుల సీనియార్టీ జాబితాలను డివిజనల్‌ సహకార సంఘం నుంచి తెప్పించుకుని, ఈ నెలాఖరులోగా బదిలీలు జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కొన్ని డీసీసీబీలు ఇప్పటికే జాబితాలను తయారుచేసి, ఆప్కాబ్‌ ఆమోదానికి పంపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,051 పీఏసీఎ్‌సల్లో దాదాపు 4,500మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, వెయ్యి మందికి పైగా తాత్కాలిక సిబ్బంది పనిచేస్తున్నారు. పీఏసీఎ్‌సలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి, డివిజనల్‌ స్థాయిలో బదిలీల కౌన్సెలింగ్‌ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సహకారశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, డీసీసీబీ బ్రాంచ్‌ స్థాయిల్లోనే బదిలీలు ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు. బదిలీ ఉత్తర్వులతో పాటు పేస్కేల్‌ వివరాలు పేర్కొనాలని, పాలకవర్గాలతో నిమిత్తం లేకుండా ఆప్కాబ్‌, డీసీసీబీలే బదిలీ ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Read more