-
-
Home » Andhra Pradesh » The burglars broke into the ASP house-NGTS-AndhraPradesh
-
ఏఎస్పీ ఇంట్లోనే దొంగలు పడ్డారు!
ABN , First Publish Date - 2022-02-23T08:51:13+05:30 IST
కడప నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఒకే అపార్టుమెంటులోని 3 ఫ్లాట్లలో తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.

290 గ్రాముల బంగారం అపహరణ.. మరో 3 ఫ్లాట్లలో 67 తులాలు
కడప(క్రైం), ఫిబ్రవరి 22 : కడప నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఒకే అపార్టుమెంటులోని 3 ఫ్లాట్లలో తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. బాధితుల్లో ఒకరు ఎస్‌ఈబీ ఏఎస్పీ కావడం విశేషం. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జీవీఆర్ టవర్స్‌లోని 308 ఫ్లాట్‌లో ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) అడిషనల్ ఎస్పీ స్వాతి, ఆమె భర్త ప్రభుత్వ దంత వైద్యుడు పి.ఆంజనేయులు నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి తాళాలు వేసి విధులకు వెళ్లిపోయారు. ఇదే అదనుగా దొంగలు ఆ ఇంటి తలుపులు పగులగొట్టి 290 గ్రాముల(సుమారు 25 తులాలు) బంగారు నగలు దోచుకెళ్లారు. వీరి పై అంతస్థులో వెంకటేశ్ అనే వ్యాపారి ఇంటి తాళాలు సైతం పగులగొట్టి 60 తులాల బంగారు నగలు, సమీపంలోని అపార్ట్‌మెంట్‌లోని మరో వ్యాపారి వెంకటశివారెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి ఒకటిన్నర తులం బంగారు నగలను దోచుకెళ్లారు. సాయంత్రం విఽధులు ముగించుకుని ఇంటికివచ్చిన ఏఎస్పీ దంపతులు తమ ఇంట్లో చోరీ జరిగిన విషయం గుర్తించారు.