-
-
Home » Andhra Pradesh » tension at the assembly anr-MRGS-AndhraPradesh
-
AP Assembly: తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నం..
ABN , First Publish Date - 2022-09-19T17:12:43+05:30 IST
అమరావతి (Amaravathi): అసెంబ్లీ (Assembly) వద్ద ఉద్రిక్తత నెలకొంది.

అమరావతి (Amaravathi): అసెంబ్లీ (Assembly) వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నం జరిగింది. ప్రభుత్వానివి రైతు వ్యతిరేక విధానాలంటూ నిరసన తెలుపుతూ తెలుగు రైతు అధ్యక్షుడు మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి (Marreddy Srinivas Reddy) ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో సచివాలయం వద్ద రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రైతుల్ని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు.