కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-17T10:06:27+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు వసంతాడ వీర వెంకట్రావు(42) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ అయ్యప్పరెడ్డి తెలిపారు.

కౌలు రైతు ఆత్మహత్య

నల్లజర్ల, ఆగస్టు 16: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు వసంతాడ వీర వెంకట్రావు(42) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ అయ్యప్పరెడ్డి తెలిపారు. వ్యవసాయ సాగు కోసం తెచ్చిన అప్పులు భారం మరింత పెరగడం, రుణ దాతల ఒత్తిడి కారణంగా సోమవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు నల్లజర్ల ఆసుపత్రికి, మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం వెంకట్రావు మృతి చెందాడు.


Read more