వైసీపీ రాక్షస రాజకీయంతో ఎన్నారైల వెనుకంజ

ABN , First Publish Date - 2022-10-11T09:48:15+05:30 IST

ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో అలజడులు సృష్టిస్తూ, రాజీనామాల డ్రామాతో వైసీపీ ఎమ్మెల్యేలు రాక్షస రాజకీయం చేస్తున్నారని

వైసీపీ రాక్షస రాజకీయంతో ఎన్నారైల వెనుకంజ

దక్షిణాఫ్రికా టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు పారా రామకృష్ణ


అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):  ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో అలజడులు సృష్టిస్తూ, రాజీనామాల డ్రామాతో వైసీపీ ఎమ్మెల్యేలు రాక్షస రాజకీయం చేస్తున్నారని దక్షిణాఫ్రికా టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు పారా రామకృష్ణ మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, రైల్వేజోన్‌ వంటి వాటిని సాధించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడితే ప్రజలు హర్షిస్తారన్నారని ఓ ప్రకటనలో  పేర్కొన్నారు. 3 రాజధానుల పేరుతో తుగ్లక్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ రాజీనామాల పేరుతో దుష్ట రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దుష్టచర్యలతో ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ఎన్నారైలు వెనుకంజ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read more