నాడు ఉచితమని.. నేడు తాకట్టా?!

ABN , First Publish Date - 2022-08-01T09:03:45+05:30 IST

నాడు పాదయాత్రలో ఇళ్లన్నీ ఉచితమని చెప్పి నేడు కట్టిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెడుతున్నారంటూ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని

నాడు ఉచితమని.. నేడు తాకట్టా?!

టిడ్కో ఇళ్లపై జగనన్న మోసం కాదా?

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం


పాలకొల్లు, జూలై 31: నాడు పాదయాత్రలో ఇళ్లన్నీ ఉచితమని చెప్పి నేడు కట్టిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెడుతున్నారంటూ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 31వ వార్డు, నాగరాజు పేటలలో ఆదివారం సైకిల్‌పై తిరుగుతూ ఇంటింటికీ వార్తా పత్రికలు పంచి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను జగన్‌ మోసం చేస్తున్నారని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ..


జగన్‌ ప్రభుత్వానికి మిగిలిన 10% టిడ్కో ఇళ్ల పనులను పూర్తి చేయడంపై శ్రద్ధ లేదని విమర్శించారు. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించే వరకు ప్రభుత్వమే ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పేరు చెప్పి ఊరికి దూరంగా 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో రూ.10 వేలు కూడా విలువ చేయని నివాస యోగ్యం కాని ముంపు ప్రాంతంలో ఒక సెంటు పట్టా ఇచ్చి మోసం చేశారని నిప్పులు చెరిగారు. ఈ మోసాన్ని ప్రజలకు వివరిస్తున్నట్టు తెలిపారు.

Read more