AP News: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-09-20T18:57:12+05:30 IST

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

AP News: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

అమరావతి (Amaravathi): ఏపీ అసెంబ్లీ (AP Assembly) నుంచి టీడీపీ (TDP) సభ్యులను స్పీకర్ (Speaker) తమ్మినేని సీతారం ఒక రోజుపాటు సస్పెండ్ (suspend) చేశారు. వరుసగా మూడో రోజు టీడీపీ సభ్యులను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. సభను పదే పదే అడ్డుకుంటున్నారంటూ సభాపతి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 


సస్పెన్షన్‌కు గురైన టీడీపీ సభ్యులు..

బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరావు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు.


మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉంది ఎవరనేది అందరికీ తెలిసిందేనన్నారు. సంక్షేమం అనేది ఈ ప్రభుత్వ లక్ష్యమని, సంక్షోభంలో టీడీపీ ఉందన్నారు. టీడీపీ సభ్యులు సభను సజావుగా జరగనివ్వకుండా గందరగోళం చేయడం, స్పీకర్ పొడియంను చుట్టిముట్టడం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ ఏదో ఒక గొడవ చేయడం, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారికి ఇది దినచర్యగా మారిందని జోగి రమేష్ అన్నారు.


కాగా శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు ఆర్డర్ ప్రకారం జరగకపోవడంపై వారు అభ్యంతరం తెలిపారు. స్పీకర్‌ను కలిసి నిరసన వ్యక్తం చేశారు. సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమైన అంశాలను, ప్రశ్నలను  ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మద్యం, లేపాక్షి భూములు లాంటి అంశాలపై సభలో చర్చ జరగకపోవడంపై  స్పీకర్ ఛాంబర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

Updated Date - 2022-09-20T18:57:12+05:30 IST