‘మద్యం’ మరణాలపై కదలిక

ABN , First Publish Date - 2022-03-18T08:10:48+05:30 IST

నాటుసారాతోపాటు ప్రభుత్వ మద్యం తాగినవారిలోనూ కొందరు మరణించారంటూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏ

‘మద్యం’ మరణాలపై కదలిక

ఏలూరు క్రైం: నాటుసారాతోపాటు ప్రభుత్వ మద్యం తాగినవారిలోనూ కొందరు మరణించారంటూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గత 15 రోజుల్లోనే సారా, మద్యం తాగి 15 మంది మరణించారని, మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ టీడీపీ సభ్యులు జాబితాను ప్రకటించారు. ఈ జాబితాను పట్టుకుని ఏలూరు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గురువారం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్నవారు ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారని ఆరా తీశారు. కొందరు అధికార పార్టీ నేతలు... బాధితుల చిరునామాలకు వెళ్లి వారి కుటుంసభ్యులను కలుసుకున్నారు. తమ వాళ్లు సారా తాగడం వల్లనే మరణించారని కొంతమంది.. మద్యం తాగే అలవాటు ఉందని కొందరు ఆ నేతలకు తెలిపారు.

Read more