TDP Fire: ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై మండిప‌డ్డ టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-09-21T17:30:05+05:30 IST

ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

TDP Fire: ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పుపై మండిప‌డ్డ టీడీపీ నేతలు

అమ‌రావ‌తి (Amaravathi): ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ (NTR Health University) పేరు మార్పుపై టీడీపీ నేతలు (TDP leaders) మండిపడ్డారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే చిన్న రాజ‌ప్ప (Chinna Rajappa) మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ (CM Jagan) తుగ్ల‌క్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారని, వాటిని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు చేయ‌డం జ‌గ‌న్ నిరంకుస‌త్వానికి ప‌రాకాష్ట‌ అన్నారు. 25 ఏళ్లుగా కొనుసాగుతున్న పేరును... ఇప్పుడు ఎందుకు మార్చాల్సివ‌స్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల‌ రామ‌చంద్ర‌రావు (Ramachandrarao) మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ కొత్త సాంప్ర‌దాయాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారని, ఎన్‌టీఆర్ జోలికి వ‌స్తే జ‌గ‌న్  ఇంటికే ప‌రిమితమ‌వుతారని హెచ్చరించారు. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు తొలగించి త‌న ప‌త‌నాన్ని తానే ప్రారంభించుకున్నారన్నారు. ఎన్‌టీఆర్ సేవలు ప్ర‌జ‌ల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయాయని, ఎంత‌మంది ముఖ్య‌మంత్రులు మారినా పేరు మార్పు అనేది జ‌ర‌గ‌లేదన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైద్య రంగానికి ప్ర‌త్యేక గుర్తింపు తేవాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే హెల్త్ యూనివ‌ర్సిటీని ఎన్‌టీఆర్ నెల‌కొల్పారన్నారు. అంగ‌ర రామ్మోహ‌న్ రావు (Rammohanarao) మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వ‌స్తే క‌డ‌ప జిల్లాకు వైఎస్ పేరును తొల‌గించే ఆలోచ‌న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లిపిస్తున్నారని అన్నారు. హెల్త్‌ యూనిర్సిటీకి ఎన్‌టీఆర్ పేరు తొల‌గింపుపై ఉద్య‌మిస్తామని స్పష్టం చేశారు. యూనివ‌ర్సిటీ పేరు మార్పు హేయ‌నీయ‌మైన చ‌ర్య‌ అని రామ్మోహ‌న్ రావు మండిపడ్డారు.

Read more