-
-
Home » Andhra Pradesh » tdp leader nakka anandbabu andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Nakka Anandbabu: దళితుల అభ్యున్నతికి జగన్ ఏం చేశారో చెప్పాలి?
ABN , First Publish Date - 2022-10-11T19:49:16+05:30 IST
దళితులను సీఎం జగన్‌రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శలు గుప్పించారు.

అమరావతి: దళితులను సీఎం జగన్‌రెడ్డి (Jagan mohan reddy) మోసం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు (Nakka anandbabu) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... దళితుల హక్కులు, పథకాలను హరించిన వ్యక్తి జగన్‌రెడ్డి (CM Jagan) అని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను సీఎం (AP CM) రద్దు చేశారని మండిపడ్డారు. స్కూళ్ల మూసివేత, రీయింబర్స్మెంట్ రద్దుతో దళితులు నష్టపోతున్నారని తెలిపారు. దళితుల కోసం ప్రత్యేకంగా ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. దళితుల అభ్యున్నతికి జగన్‌రెడ్డి (YCP Chief) ఏం చేశారో చెప్పాలని నక్కా ఆనంద్‌బాబు (TDP Leader) డిమాండ్ చేశారు.