వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలకు ఏం చేయాలి?: Lokesh

ABN , First Publish Date - 2022-02-23T18:33:19+05:30 IST

అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలకు ఏం చేయాలి?: Lokesh

అమరావతి: అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని... మరి వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలకు ఏం చేయాలని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ నేతల బూతులు పోలీసులకు వినసొంపుగా ఉన్నాయని మండిపడ్డారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు.. జిల్లాలు దాటి మరీ టీడీపీ నేతలను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత లోకేష్‌ వ్యాఖ్యానించారు. 

Read more