ఆంధ్రాను అనాధగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది: Kollu ravindra

ABN , First Publish Date - 2022-07-08T19:45:11+05:30 IST

అన్నపూర్ణగా పేరు గడించిన ఆంధ్ర రాష్ట్రాన్ని అనాధగా మార్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని మాజీ మంత్రి, టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శించారు.

ఆంధ్రాను అనాధగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది: Kollu ravindra

అమరావతి: అన్నపూర్ణగా పేరు గడించిన ఆంధ్ర రాష్ట్రాన్ని అనాధగా మార్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)కి దక్కుతుందని మాజీ మంత్రి, టీడీపీ(TDP) పోలీట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర (Kollu ravindra) విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా‌చౌక్ వద్ద  టీడీపీ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు (Konakalla narayana rao), ప్రధాన కార్యదర్శి బోడే ప్రసాద్ (Bode prasad), రైతు విభాగం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలు, రైతు విభాగం ప్రతినిధులుహాజరయ్యారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్ఓ వెంకటేశ్వర్లుకు టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు.

Read more