devineni uma: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైంది

ABN , First Publish Date - 2022-10-03T17:22:27+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు.

devineni uma: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైంది

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం (Government) విఫలమైందని టీడీపీ నేత దేవినేని ఉమా (Devineni uma) విమర్శించారు. క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ (YCP) ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అనుచరులు, బంధువులతో వెళ్ళడం దుర్మార్గమని మండిపడ్డారు. 41 నెలల్లో దుర్గగుడి అభివృద్ధికి ఏం చేశారో సీఎం జగన్ (Jagan) ఎందుకు చెప్పలేక పోయారని దేవినేని ఉమా (TDP Leader) ప్రశ్నించారు. 

Read more