-
-
Home » Andhra Pradesh » tdp leader devineni uma andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Devineni uma: చింతకాయల విజయ్ పట్ల ప్రభుత్వ కక్షసాధింపు దుర్మార్గం
ABN , First Publish Date - 2022-10-02T14:09:04+05:30 IST
తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి చింతకాయల విజయ్ పట్ల ప్రభుత్వ కక్షసాధింపు దుర్మార్గమని టీడీపీ నేత దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి చింతకాయల విజయ్(Chintakayala vijay) పట్ల ప్రభుత్వ కక్షసాధింపు దుర్మార్గమని టీడీపీ నేత దేవినేని ఉమా (Devineni uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కుటుంబ సభ్యులు లేని సమయంలో పిల్లలపట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు. నోటీసులు ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి వేధించాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ‘‘మీ తప్పుడు కేసులు, దాడులకు మూల్యం చెల్లించక తప్పదు వైఎస్ జగన్ (YS Jagan mohan reddy)’’ అని దేవినేని ఉమా ట్వీట్ చేశారు.