మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-03-08T15:56:35+05:30 IST

మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్ట్

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  మైలవరం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని అఖిలపక్షం పిలుపునిచ్చిన మైలవరం బంద్ కార్యక్రమానికి బయలుదేరిన దేవినేని ఉమాను గొల్లపూడి కార్యాలయం దగ్గర పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. 


మరోవైపు మైలవరం బంద్‌కు మైలవరం రెవిన్యూ డివిజన్ పోరాట సాధన సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మైలవరం పట్టణం పోలీసుల దిగ్బంధంలో ఉంది. బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్‌‌లు మద్దతు తెలిపాయి. కాగా... బంద్‌కు అనుమతులు ఇవ్వని పోలీసులు... దుకాణలను బలవంతంగా ముసివేయిస్తే అరెస్ట్‌‌లు చేస్తామని నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మైలవరంలో హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు బంద్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు కలిగించినా మైలవరం బంద్‌ను విజయవంతం చేస్తామని సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. పోలీసుల నిరంకుశ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read more