Atchannaidu: జగన్ అండతోనే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బరితెగింపు

ABN , First Publish Date - 2022-10-14T16:55:27+05:30 IST

సీఎం జగన్ రెడ్డి అండతోనే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి బరితెగించి వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Atchannaidu: జగన్ అండతోనే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బరితెగింపు

అమరావతి: సీఎం జగన్ రెడ్డి అండతోనే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి (Shivaprasad reddy) బరితెగించి వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu atchannaidu) విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... దోపిడి చేయటం, దాన్ని ప్రశ్నించివారిపై దాడులు చేయటం శివప్రసాద్ రెడ్డి (prodduturu MLA)కి దినచర్యగా మారిందన్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి (Praveenkumar reddy)పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపటం దుర్మార్గమని మండిపడ్డారు. ఎగ్జిబిషన్ పేరుతో ఎమ్మెల్యే పేద ప్రజల డబ్బులు దోపిడి చేశారని... దీన్ని బయటపెట్టినందుకే రౌడీ మూకల్ని పంపి ప్రవీణ్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. దాడి చేసిన నిందితుల్ని వదలి బాధితుల్ని జైలుకి పంపాలని ఏ సెక్షన్‌లో ఉందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న వాళ్లు ఎంతటోళ్లైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. నియోజవర్గ ప్రజల్ని పీడిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) సంగతి తేలుస్తామని అచ్చెన్నాయుడు (TDP state presidents) హెచ్చరించారు. 

Read more