పెరిగిన ధరలు, అవినీతి, అరాచకాలు ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’..

ABN , First Publish Date - 2022-12-06T23:41:44+05:30 IST

‘‘పెరిగిన ధరలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు పెరిగిపోతున్నాయి. రాష్ర్టానికి ఇదేం ఖర్మ పట్టింది.’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మండిపడ్డారు.

పెరిగిన ధరలు, అవినీతి, అరాచకాలు   ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’..
ర్యాలీలో పాల్గొన్న బీద రవిచంద్ర, కన్నబాబు తదితరులు

ఏఎస్‌పేట, డిసెంబరు 6: ‘‘పెరిగిన ధరలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు పెరిగిపోతున్నాయి. రాష్ర్టానికి ఇదేం ఖర్మ పట్టింది.’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మండిపడ్డారు. మంగళవారం మండలంలోని హసనాపురంలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరెంట్‌ బిల్లులు, బస్సు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌, నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు కరపత్రాలు అందజేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గూటూరు మురళీకన్నబాబు, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, బుల్లెట్‌ రమణ, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, మండల అధ్యక్షుడు అబ్బూరి రమేష్‌ నాయుడు, ఏఎ్‌సపేట, సంగం, ఆత్మకూరు మండలాలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:41:48+05:30 IST