టీడీపీపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ.. ఎందుకంటే..!!

ABN , First Publish Date - 2022-07-13T00:31:32+05:30 IST

రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ముతో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి, యనమల, అచ్చెన్నాయుడు, సీఎం రమేశ్‌, జీవీఎల్, సోమువీర్రాజు,..

టీడీపీపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ.. ఎందుకంటే..!!

అమరావతి: రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముతో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, యనమల, అచ్చెన్నాయుడు, సీఎం రమేశ్‌, జీవీఎల్, సోమువీర్రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును టీడీపీ అధినేత చంద్రబాబు సన్మానించారు. అలాగే ముర్ముకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు పరిచయం చేశారు. 


కాగా రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముని టీడీపీ ఆత్మీయ సమావేశానికి పిలవడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల అనంతరం టీడీపీ, బీజేపీ నేతలు మాటామంతి కలిపారు. ద్రౌపది ముర్ము‌ను ఎన్‌డీఏ అభ్యర్ధిగా నియమించడంపై టీడీపీ, బీజేపీ నేతలు చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మిజోరం రెండు రాష్ట్రాలు మాత్రమే పూర్తిగా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము మంగళవారం ఏపీకి వచ్చారు. తొలుత మంగళగిరిలోని సీకే కన్వెషన్ సెంటర్‌కు వెళ్లి... తనకు మద్దతివ్వాలని వైసీపీ నేతలను కోరారు. అనంతరం విజయవాడలో తాజ్ గేట్ వే హోటల్‌కు చేరుకున్న ముర్ముకు చంద్రబాబు స్వాగతం పలికారు. 

Read more