-
-
Home » Andhra Pradesh » Tax Services Association-NGTS-AndhraPradesh
-
వాణిజ్య పన్నుల శాఖలో అస్తవ్యస్త విధానం
ABN , First Publish Date - 2022-07-05T08:08:51+05:30 IST
వాణిజ్య పన్నుల శాఖలో అస్తవ్యస్త విధానం

కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్
వాణిజ్యపన్నుల శాఖలో ఆదాయం పెరుగుదల కోసం చేసే ప్రయత్నాలుగా పేర్కొంటున్న శాఖ పునర్వ్యవస్తీకరణ ఎలాంటి హేతుబద్ధత లేకుండా శాఖను గందరగోళంగా పడవేసే విధంగా ఉందని ఏపీ వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్ సూర్యనారాయణ, రమే్‌షకుమార్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాఖలోని అధికారాలన్నీ ఉన్నతాధికారుల వద్ద ఉండే విధంగా మూడు ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు శాఖను బలహీనపరుస్తోందని తెలిపారు. బదిలీలను పూర్తిగా కౌన్సిలింగ్ విధానంలో చేయాలని, స్టేషన్ ప్రాతిపదిక కాకుండా సర్కిల్ ప్రాతిపదికన చేయాలని డిమాండ్ చేశారు.