వివేకా హత్య కేసులో జగన్ ప్రభుత్వానికి సుప్రీం షాక్..

ABN , First Publish Date - 2022-09-19T19:33:28+05:30 IST

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు(YS Viveka murder case)లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమకు ఏపీ(AP)లో

వివేకా హత్య కేసులో జగన్ ప్రభుత్వానికి సుప్రీం షాక్..

Delhi : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు(YS Viveka murder case)లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమకు ఏపీ(AP)లో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని.. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh) నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసి.. తదుపరి దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో వైఎస్‌ సునీత(YS Sunitha) పిటిషన్‌ వేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా(MR Shah), జస్టిస్‌ కృష్ణమురారి(Krishna Murari) ధర్మాసనం విచారణ చేపట్టింది. 


సునీత లేవనెత్తిన అంశాలపై... సమాధానం చెప్పాలని సీబీఐ(CBI), రాష్ట్ర ప్రభుత్వా(State Government)నికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు(YS Viveka Case)లో తదుపరి విచారణను వచ్చే నెల 14న చేపట్టనున్నట్లు ధర్మాసనం(Supreme Court) ప్రకటించింది. సునీత తరపున సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూత్రా(Lawyer Siddardh Lutra) వాదనలు వినిపించారు. విచారణ సాగకుండా... దర్యాప్తు సంస్థ అధికారులు, సాక్షులను బెదిరిస్తున్నారని ధర్మాసనానికి సిద్దార్థ వెల్లడించారు. విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) పరిధిలోని ట్రయల్‌ కోర్టుకు మార్చాలని సునీతా రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2022-09-19T19:33:28+05:30 IST