Sujana Chowdary సీఎం జగన్‌రెడ్డికి తన తండ్రిపై అంత ప్రేముంటే..

ABN , First Publish Date - 2022-09-21T21:35:31+05:30 IST

ఎన్టీఆర్ పేరు మార్పు ప్రభుత్వ అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని సుజనా చౌదరి అన్నారు.

Sujana Chowdary సీఎం జగన్‌రెడ్డికి తన తండ్రిపై అంత ప్రేముంటే..

అమరావతి (Amaravathi): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడం ఏపీ ప్రభుత్వ (AP Govt.) అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి (Sujana Chowdary) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు తన తండ్రిపై అంత ప్రేముంటే ఏదైనా కొత్త సంస్థను స్థాపించి దానికి ఆయన పేరు పెట్టుకుంటే ఎవరూ తప్పు పట్టరని అన్నారు. ఇలాంటి చర్యలు రాబోయే రోజుల్లో అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుజనా చౌదరి అన్నారు.

Updated Date - 2022-09-21T21:35:31+05:30 IST