‘లోన్‌ యాప్‌’ ఒత్తిడి భరించలేక చేనేత కార్మికుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-10-12T08:54:46+05:30 IST

లోన్‌ యాప్‌ వారి ఒత్తిడి భరించలేక శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికుడు మంగళవారం ఆత్మహత్యకు యత్నించాడు.

‘లోన్‌ యాప్‌’ ఒత్తిడి భరించలేక చేనేత కార్మికుడి ఆత్మహత్యాయత్నం

ధర్మవరం, అక్టోబరు 11: లోన్‌ యాప్‌ వారి ఒత్తిడి భరించలేక శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికుడు  మంగళవారం ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కేశవనగర్‌కు చెందిన  చేనేత కార్మికుడు కుండా శ్రీనివాసులు మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన తల్లిపేరిట లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకున్నాడు. దీన్ని తీర్చేందుకు బయట చిన్న చిన్న అప్పులు చేశాడు. అయినా పూర్తిస్థాయిలో తీర్చలేకపోయాడు. ఈ క్రమంలో లోన్‌ యాప్‌ వారి నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో దిక్కుతోచక ఇంట్లో నిద్రమాత్రలు మింగాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతున్నాడు.  

Read more