భార్య మందలించిందని...భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-29T13:12:46+05:30 IST

తాగినందుకు భార్య మందలించిందని ఆగిరిపల్లిలో చిలకబత్తుల సాంబశివ రావు(శివ) మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు ముసునూరు

భార్య మందలించిందని...భర్త ఆత్మహత్య

పశ్చిమ గోదావరి: తాగినందుకు భార్య  మందలించిందని ఆగిరిపల్లిలో చిలకబత్తుల సాంబశివ రావు(శివ) మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు ముసునూరు గ్రామానికి చెందిన శివ మూడేళ్ల క్రితం సునీత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆగిరిపల్లిలో నివసిస్తూ  స్థానిక  గ్యాస్‌ కంపెనీలో కలెక్షన్‌ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన ఇతను భార్య నగలు అమ్మి, బైక్‌ను కూడా తాకట్టుపెట్టి తాగుడుకు ఖర్చు చేశాడు. మంగళవారం తన తల్లికి వచ్చిన చేయూత సొమ్ము కూడా తీసుకుని తాగేయడంతో రాత్రి 10 గంటల సమయంలో భార్య ఎందుకు తాగావని మందలించింది. క్షణికావేశంలో ఇంట్లో ఇనుప దూలానికి ఉరి వేసుకున్నాడు. గమనించిన భార్య అతనిని నూజివీడు ఏరియా ఆప్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు మరణించినట్లుగా ధ్రువీకరించారు. మృతుడి తండ్రి  ఫిర్యాదు మేరకు  ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more