సలహాదారుపై స్టే హర్షణీయం

ABN , First Publish Date - 2022-08-25T08:56:37+05:30 IST

సలహాదారుపై స్టే హర్షణీయం

సలహాదారుపై స్టే హర్షణీయం

బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ 


అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుల పేరుతో పదవులు సృష్టించి, పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెడుతూ ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తోందని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ ఆరోపించారు. దేవాలయాల పట్ల, ఆగమాల పట్ల అవగాహనలేని వ్యక్తిని సలహాదారుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సలహాదారు నియామకం వెనుక విశాఖ శారదాపీఠానికి చెందిన స్వరూపానంద స్వామీజీ ప్రమేయం ఉందని ఆరోపించారు. 

Read more