-
-
Home » Andhra Pradesh » State High Court Judge Justice-NGTS-AndhraPradesh
-
చిన వెంకన్న సేవలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్
ABN , First Publish Date - 2022-09-19T09:56:17+05:30 IST
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఆదివారం

ద్వారకాతిరుమల, సెప్టెంబరు 18: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం స్వామివారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు.