సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి విహారం

ABN , First Publish Date - 2022-10-04T07:48:49+05:30 IST

తిరుమల బ్రహ్మోత్సవాల్లో సోమవారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్ప కొలువుదీరారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సూర్యప్రభపై వ్చుత్స్య నారాయణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.

సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి విహారం

నేడు మాడ వీధుల్లో రథోత్సవం


తిరుమల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల బ్రహ్మోత్సవాల్లో సోమవారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్ప కొలువుదీరారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సూర్యప్రభపై వ్చుత్స్య నారాయణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం నేత్రానందంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య మలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. బ్రహోత్సవాల్లో ప్రధానంగా భావించే రథోత్సవం మంగళవారం ఉదయం జరుగనుంది.Read more