27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-10T19:17:56+05:30 IST

ఈ నెల 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల : ఈ నెల 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 27న శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పెద్దశేష వాహన సేవలో సీఎం జగన్‌ పాల్గొంటారని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. 28న శ్రీవారిని దర్శించుకుని పరకామణి మండపాన్ని జగన్ ప్రారంభించనున్నారు. పరకామణి లెక్కింపును భక్తులు చూసేందుకు అనుమతిస్తామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.


Read more