కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై శ్రీవారి అభయం

ABN , First Publish Date - 2022-10-01T09:29:53+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం కల్పవృక్ష వాహనంలో

కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై శ్రీవారి అభయం

తిరుమల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం కల్పవృక్ష వాహనంలో రాజమన్నార్‌ రూపం ధరించి దేవేరులతో కలిసి శ్రీవారు మాడవీధుల్లో ఊరేగారు. బాలకృష్ణుడి రూపంలో మలయప్ప స్వామి రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కలిసి ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో ప్రఽధాన వాహనమైన గరుడసేవ శనివా రంజరుగనుంది. రాత్రి 7 నుంచి వేకువజాము 2 గంట ల వరకు వాహనసేవను భక్తులందరూ వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 

Read more