విషాదం... ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-23T21:29:49+05:30 IST

జిల్లాలోని పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

విషాదం... ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

శ్రీసత్యసాయి: జిల్లాలోని పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. లడ్డు(5), బుజ్జి(2)లను చంపి తల్లి భాగ్యమ్మ(27) ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read more