Srisailam : శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి శోభ

ABN , First Publish Date - 2022-11-08T03:41:18+05:30 IST

కార్తీక మాస రెండో సోమవారం, పౌర్ణమి పురస్కరించుకుని శ్రీశైల క్షేరత్రం భక్తజనంతో కిటకిటలాడింది.

Srisailam : శ్రీశైలంలో   కార్తీక పౌర్ణమి శోభ

కార్తీక మాస రెండో సోమవారం, పౌర్ణమి పురస్కరించుకుని శ్రీశైల క్షేరత్రం భక్తజనంతో కిటకిటలాడింది. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు. క్యూలైన్లలో బారులుతీరి భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం ఎదుట మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. లక్షదీపోత్సవం, జ్వాలాతోరణం, ఆకాశదీపం కార్యక్రమాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాయి.

-శ్రీశైలం

Updated Date - 2022-11-08T03:41:20+05:30 IST