సరిహద్దుపై ఏఎస్‌ఐ నుంచి నివేదిక తెప్పించండి

ABN , First Publish Date - 2022-07-05T08:05:38+05:30 IST

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక సరిహద్దు వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిేసందుకు ఆర్కియాలజికల్‌ సర్వే

సరిహద్దుపై ఏఎస్‌ఐ నుంచి నివేదిక తెప్పించండి

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో శ్రీలక్ష్మి విజ్ఞప్తి


హైదరాబాద్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసులో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక సరిహద్దు వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిేసందుకు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ) నుంచి సమగ్ర నివేదిక తెప్పించేందుకు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి  కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె తరఫున న్యాయవాది రాఘవాచార్యులు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో  వాదనలు వినిపించారు.  ఈ అంశంలో సీఆర్పీసీ సెక్షన్‌ 173 ప్రకారం సీబీఐ తుది నివేదిక సమర్పించేవరకు శ్రీలక్ష్మిపై నమోదైన కేసుల విచారణను నిలిపివేయాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు. అయితే, ఈ విషయంపై సీబీఐని న్యాయస్థానం ప్రశ్నించడంతో తమకు అందుకు కొంత సమయం కావాలని బదులు చెప్పడంతో కేసును 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్‌ రమే్‌షబాబు వెల్లడించారు.

Read more