టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2022-09-11T05:01:58+05:30 IST

కోవిలాం గ్రామ పంచా యతీలో స్థిరపడిన తులగాం గ్రామానికి చెందిన వంశధార నిర్వాసితులు, వైసీపీ నేతలు జి.శ్రీరాములు, కె.తిరుపతి, జె.తిరుపతి, జి.గోవిందరావు తదితరులు శనివారం టీడీపీలో చేరారు. కొత్తూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వా నించారు.

టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరమణమూర్తి


ఎల్‌.ఎన్‌.పేట:  కోవిలాం గ్రామ పంచా యతీలో స్థిరపడిన తులగాం గ్రామానికి చెందిన వంశధార నిర్వాసితులు, వైసీపీ నేతలు జి.శ్రీరాములు, కె.తిరుపతి, జె.తిరుపతి, జి.గోవిందరావు తదితరులు శనివారం టీడీపీలో చేరారు. కొత్తూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు అందించిన ప్యా కేజీలపై తీరని అన్యాయం జరిగిందని, అందు వల్ల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చామన్నారు. సాధారణ ఎన్నికలు సమీ పిస్తుండడంతో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు రావడం పార్టీకి మేలు జరుగుతుందని  కలమట వెంకట రమణమూర్తి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎన్‌.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

  

Read more