గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-11-12T00:09:35+05:30 IST

రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ అబ్జర్వర్‌ విమలారాణి పిలుపునిచ్చారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
మాట్లాడుతున్న విమలారాణి

- ఆర్టీఎస్‌ శిక్షణలో టీడీపీ అబ్జర్వర్‌ విమలారాణి

శ్రీకాకుళం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ అబ్జర్వర్‌ విమలారాణి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సమక్షంలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ఆర్టీఎస్‌ శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్‌ విమలారాణి మాట్లాడుతూ.. భవిష్యత్‌ ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. ఎక్స్‌పర్ట్స్‌ కమిటీని నియమించి పార్టీ కార్యక్ర మాల్ని ప్రజల మధ్యకు ఎలా తీసుకువెళ్లాలో కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శిక్షణ పరిశీలకులు పీరుకట్ల విఠల్‌, జిల్లా నైపుణ్య విభాగాల అధ్యక్షుడు సంతోష్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, తోణంగి వెంకన్నయాదవ్‌, బూత్‌, సెక్షన్‌ ఇన్‌చా ర్జిలు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

అవినీతిపరులకు బుద్ధిచెప్పండి: అప్పలసూర్యనారాయణ

అవినీతి కారణంగానే నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతు న్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు గుండ అప్పలసూర్యనా రాయణ పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అవినీతి కారణంగా దేశం సర్వనా శనం అవుతుందని సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించిందని వివరించారు. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలని, ఎట్టిపరిస్థితుల్లో అవినీతిపరులకు ఎన్నికల్లో బుద్ధిచెప్పా లన్నారు. ఉన్నత విద్యావంతులు, సమాజంపై బాధ్యతగా వ్యవహరించే వ్యక్తులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లతోపాటు ఉన్నత ప్రతిభ కలిగిన వ్యక్తులు రాజకీయ ప్రవేశం చేద్దా మని యత్నించినా సఫలీకృతం కాలేకపోతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలను ప్రజలు పరిగణలోకి తీసుకొని సేవ చేసిన వారిని ఎన్నుకోవాలని సూచించారు.

Updated Date - 2022-11-12T00:09:36+05:30 IST