పనిఒత్తిడి తగ్గించాలి

ABN , First Publish Date - 2022-12-13T00:01:14+05:30 IST

తమపై పని ఒత్తిడి తగ్గించాలని వీఆర్వోలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

పనిఒత్తిడి తగ్గించాలి
నందిగాంలో తహసీల్దార్‌కి వినతిపత్రం అందిస్తున్న వీఆర్‌వోలు

- జిల్లా వ్యాప్తంగా వీఆర్వోల నిరసన

తమపై పని ఒత్తిడి తగ్గించాలని వీఆర్వోలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి రోజూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేసేలా చూడాలని, రీసర్వేకి సంబంధించిన ఖర్చుల బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, గ్రేడ్‌-2 వీఆర్‌వోలను రెగ్యులర్‌ చేయాలని తదితర సమస్య పరిష్కారం కోరుతూ డిమాండ్‌ చేశారు. అనంతరం ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు.

- ఆంధ్రజ్యోతి బృందం, శ్రీకాకుళం

Updated Date - 2022-12-13T00:01:14+05:30 IST

Read more