టీడీపీని గెలిపించాలనే కసితో పనిచేయండి

ABN , First Publish Date - 2022-09-27T05:07:18+05:30 IST

టీడీపీని గెలిపించాలనే కసితో ప్రతి కార్యకర్త పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయ కులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు.

టీడీపీని గెలిపించాలనే కసితో పనిచేయండి
టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు


 బటన్‌ నొక్కడం.. మోసం చేయడం
 వైసీపీ సర్కార్‌కే చెల్లింది
  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
టెక్కలి:
టీడీపీని గెలిపించాలనే కసితో ప్రతి కార్యకర్త పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,  ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయ కులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, తుగ్లక్‌ పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకు బటన్‌ నొక్కడం, మోసం చేస్తోందని, అర్హులకు పథకా లు అందించడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ నియో జకవర్గ కేంద్రం లో రిలే దీక్షలు చేపట్టాలన్నారు. బూత్‌, మండల, పట్టణ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని,  ఈ కమిటీలన్నీ ప్రస్తుతం జరుగు తున్న ఓటు కార్డుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ సరి చూసు కోవాలన్నారు. కాన్ఫ రెన్స్‌లో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోట బొమ్మాళి మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, జీరు భీమారావు, బోయిన రమేష్‌, రాష్ట్ర కార్య దర్శి బోయిన గోవిందరాజులు, ఐటీడీపీ కో-ఆర్డినేటర్‌ అప్పిని వెంకటేష్‌, లాడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
  

Read more