వంట చెరకు తెస్తుండగా..

ABN , First Publish Date - 2022-11-20T23:55:54+05:30 IST

తోటలో వంట చెరుకు తెస్తున్న మహిళకు ద్విచక్ర వాహన రూ పంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన పాల వలస సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సా యంత్రం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

వంట చెరకు తెస్తుండగా..
చంద్రావతి (ఫైల్‌)

వంట చెరకు తెస్తుండగా..

బైక్‌ ఢీకొని మహిళ దుర్మరణం

ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు

సోంపేట రూరల్‌, నవంబరు 20 : తోటలో వంట చెరుకు తెస్తున్న మహిళకు ద్విచక్ర వాహన రూ పంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన పాల వలస సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సా యంత్రం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాలవలస సమీపంలో హైవేపై ద్విచక్ర వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన తోట చంద్రావతి (28) అనే మహిళ మృతిచెం దారు. కవిటి నుంచి ఇద్దరు యువకులు బైక్‌పై పర్లాఖిమిడి వెళుతున్నారు. సరిగ్గా పాలవలస వద్దకు వచ్చేసరికి.. తోట నుంచి వంట చెరుకు తెస్తున్న చంద్రావతిని ఢీకొట్టారు. దీంతో చంద్రావతి అపస్మారకస్థితికి చేరుకుంది. వెనువెంటనే హైవే అంబులెన్స్‌లో బారువ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఆ ఇద్దరు యువకులకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రాథమిక వైద్యం అనంత రం హుటాహుటిన శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతురాలు చం ద్రావతికి భర్త భాస్కరరావు, ఇద్దరు పిల్లలు హాసిని, అభి ఉన్నారు. భర్త ప్రస్తు తం ఇతర ప్రాంతాల్లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. చంద్రావతి స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ పిల్లలిద్దర్నీ చదివిస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బారువ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-20T23:55:54+05:30 IST

Read more