మహిళపై దౌర్జన్యం.. ముగ్గురిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-06-07T06:12:41+05:30 IST

విక్రంపురంలో సోమవారం సాయంత్రం పొలం వద్ద జరిగిన తగాదా నేపఽథ్యంలో గ్రామానికి చెందిన బొంగు ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇదే గ్రామానికి చెందిన బి.కాంతారావు, నీలవేణి, చంద్రలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు.

మహిళపై దౌర్జన్యం.. ముగ్గురిపై కేసు నమోదు

టెక్కలి రూరల్‌: విక్రంపురంలో సోమవారం సాయంత్రం పొలం వద్ద జరిగిన తగాదా నేపఽథ్యంలో గ్రామానికి చెందిన బొంగు ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ఇదే గ్రామానికి చెందిన బి.కాంతారావు, నీలవేణి, చంద్రలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు. ప్రభావతికి చెందిన పంటపొలంలో అక్రమంగా జేసీబీతో పనులు చేయిస్తుండడాన్ని ప్రశ్నించడంతో ఆమెపై దౌర్జన్యంగా ప్రవర్తించి కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

 

Read more